News February 13, 2026
భైంసాలో ఇండిపెండెంట్ అభ్యర్థి WIN

భైంసా పట్టణంలోని రాహుల్ నగర్ (7వ వార్డు) ఫలితం వెలువడింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన రమాబాయి ప్రత్యర్థి రాహుల్(MIM)పై 277 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి అధికార, ప్రతిపక్ష పార్టీలను వెనక్కి నెట్టి విజేతగా నిలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రమాబాయి గెలుపుతో ఆమె అనుచరులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
Similar News
News March 11, 2026
ట్రంప్ కీలక నిర్ణయం.. రిలయన్స్‌తో భారీ డీల్

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైనింగ్ ప్రాజెక్టును అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత USలో ఏర్పాటవుతున్న తొలి రిఫైనరీ ఇదే. ఈ $300 బిలియన్ల ప్రాజెక్టులో రిలయన్స్ పార్ట్‌నర్‌గా చేరుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అందుకు కంపెనీకి థాంక్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే క్లీన్లీయెస్ట్ రిఫైనరీ అని, వేలాది ఉద్యోగాలు రావడమే కాకుండా అమెరికా ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుందని పేర్కొన్నారు.
News March 11, 2026
TU: “అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నావెల్ థెరాప్టిక్స్” పై జాతీయ సదస్సు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో “అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నావెల్ థెరాప్టిక్స్” అనే అంశంపై ఈ నెల 23,24 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డా.చంద్రశేఖర్ తెలిపారు. సందర్భంగా జాతీయ సదస్సు బ్రోచర్లను ఉపకులపతి ఆచార్య యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. అధ్యాపకులు సత్యనారాయణ, శిరీష, ప్రసన్న శీల పాల్గొన్నారు.
News March 11, 2026
ఖమ్మం: దారుణం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

కూసుమంచి మండలంలోని ఒక గ్రామంలో ఐదేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన వెలుగుచూసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో, వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


