News February 26, 2026

భైంసాలో షీటీం భరోసా.. కలిసిన కుటుంబాలు

image

ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో షీ టీం కీలక పాత్ర పోషించింది. కుటుంబ వివాదాలతో వచ్చిన వారికి షీ టీం సిబ్బంది ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విడిపోయిన వారిని తిరిగి కలిపారు. కౌన్సిలింగ్ కోసం నిర్మల్ వరకు వెళ్లే భారం తప్పించి భైంసాలోనే ఈ సదుపాయం కల్పించడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News April 12, 2026

పాల్వంచ: విధి వక్రీకరించినా.. పరీక్షలో గెలిచాడు

image

విధి ఆ యువకుడి ప్రాణాన్ని హరించినా.. అతడు రాసిన రాత మాత్రం గెలిచింది. కరకవాగు 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ విజయలక్ష్మి కుమారుడు భట్టు అఖిల్ నందన్ ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. ఆదివారం విడుదలైన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అఖిల్ ఉత్తీర్ణుడైనట్లు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫలితం వచ్చే సమయానికి కొడుకు ప్రాణాలతో లేకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News April 12, 2026

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)

News April 12, 2026

NZB: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టం: MP

image

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టమని, 2029 ఎన్నికల నాటికి వాటిని అమలు చేయబోతున్నామని NZB MP ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లపై చట్టం చేయబోతున్నారని అన్నారు. మహిళల 30 ఏళ్ల నిరీక్షణకు ప్రధాని మోదీ తెరదించారని, వారికి ఇంతకంటే పెద్ద పండుగ ఉండదని పేర్కొన్నారు.