News October 11, 2024
భైంసా: ఆర్టీసీ డ్రైవర్ MISSING
ఆర్టీసీ డ్రైవర్ అదృశ్యమైన ఘటన భైంసాలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎండీ.గౌస్ ఉద్దీన్ వివరాల ప్రకారం.. శివాజీనగర్‌కు చెందిన శామంతుల సుదర్శన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదాయానికి మించి అప్పులు కావడంతో కనిపించకుండా పోయాడు. కాగా ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్న నా మరణానికి ఎవరూ కారణం కారు’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టి వెళ్లి పోయాడు. భార్య అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 1, 2024
బేల: దండారి ఉత్సవాల్లో మాజీ మంత్రి జోగు రామన్న
బేల మండలంలోని వాడగూడ, జంగుగూడ, మసాలా (బి), సదల్పూర్, మరిన్ని గ్రామాలలో ఏర్పాటు చేసిన దీపావళి దండారి ఉత్సవాల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. జోగు రామన్న మాట్లాడుతూ.. దండారీలకు రూ.10 వేల ఆర్థిక సాయం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలోనే ఆదివాసీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు రామన్న పేర్కొన్నారు.
News November 1, 2024
నిర్మల్: పండగ పూట విషాదం.. ఇద్దరు మృతి
నిర్మల్ జిల్లాలో చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా.. పట్టణంలోని YSR కాలనీకి చెందిన నరేశ్(25) తామర పువ్వుల కోసం చెరువుకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. కాగా, బంగల్పేట్ చెరువులో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు జోగుల సీతారాం మేస్త్రిగా గుర్తించారు.
News November 1, 2024
దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ ఎంపీ
ఆదిలాబాద్ పట్టణంలో గురువారం దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులు నిర్వహించిన లక్ష్మీ పూజలో ఎంపీ గొడం నగేశ్ పాల్గొన్నారు. ఈ మేరకు ఓ ట్రావెల్స్ కార్యాలయంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొని టపాసులు కాల్చారు. అనంతరం జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.