News August 17, 2024

భైంసా పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడి పరారీ

image

భైంసా పట్టణంలో మారణాయుధాలతో పట్టుబడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటనపై శుక్రవారం ఏఎస్పీ అవినాష్ కుమార్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అయితే సమావేశం ముగిసిన గంటకే నిందితుడు పరారవడంతో సంచలనం రేపుతోంది. నీరు తాగుతానని అనడంతో సిబ్బంది నీరు తీసుక వచ్చేలోపే నిందితుడు పరారీ అయ్యారని స్థానిక పోలీసులు వాపోతున్నారు. వెంటనే విషయం తెలుసుకున్న సీఐ, ఏఎస్పీ విస్తృతంగా గాలిస్తున్నారు.

Similar News

News September 19, 2024

ADB: ప్రశాంతంగా ముగిసిన గణేష్ ఉత్సవాలు

image

గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతూ 11 రోజుల పాటు నిద్రాహారాలు మాని విధులను నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే గణపతి మండపాల నిర్వాహకులకు, హిందూ సంఘాలకు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవ కమిటీ‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

News September 19, 2024

ADB: రేపటినుండి పరీక్షలు.. అందుబాటులో హాల్ టికెట్స్

image

అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో PG మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్‌లు యూనివర్సిటీ వెబ్సైట్ www braou.online.inలో అందుబాటులో ఉన్నాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

News September 19, 2024

ఆదిలాబాద్: క్రీడాకారుల వివరాలు ఇవ్వండి: DYSO

image

అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పతకాలు సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ పూర్తి వివరాలు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో ఈ నెల 23లోపు అందించాలని DYSO వేంకటేశ్వర్లు తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి వివరాలను పట్టిక రూపంలో పొందుపర్చనున్నారు. వివరాలకు ఆదిలాబాద్ క్రీడా పాఠశాల జూడో కోచ్ రాజును సంప్రదించాలన్నారు.