News February 4, 2025

భైంసా: ప్రైవేటులో పత్తి ధర రూ. 7,000

image

నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మంగళవారం ప్రైవేట్ పత్తి ధర రూ. 7వేలు ఉన్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. సోమవారం ధరలతో ప్రైవేటులో ఎలాంటి మార్పులేదన్నారు. జిన్నింగ్ మిల్లులలో పత్తి నిలువలు ఎక్కువ అయినందున సీసీఐ పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.

Similar News

News April 10, 2026

ముదిగుబ్బ: ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

ముదిగుబ్బ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతపురం రోడ్డులో ముందు వెళ్తున్న నీటి ట్యాంకర్‌ను ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హెడ్ కానిస్టేబుల్ గణేశ్ ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News April 10, 2026

వేరుశనగ ధరలు పతనం

image

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజులుగా క్వింటా రూ.7 వేలకు పైగా పలికిన ధర, గురువారం గరిష్ఠంగా రూ.6,690లకు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌కు 113 క్వింటాళ్ల దిగుబడి రాగా, కనిష్ఠ ధర రూ.5,700, మధ్యస్తంగా రూ.6,121లకు అమ్ముడుపోయినట్లు యార్డ్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. ధరల తగ్గుదలపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 10, 2026

రూ.200 కోట్లతో మరో సైబర్ టవర్

image

ఐటీ హంగులకు ప్రతీకగా త్వరలో మరో అత్యాధునిక సైబర్ టవర్ నిర్మాణం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కోసం కైత్లాపూర్‌లోని 5ఎకరాల స్థలంలో G+8 అంతస్తుల సమీకృత భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.200కోట్ల అంచనాతో నిర్మించనున్నారు. 3జోన్లు, 16సర్కిళ్ల పరిధిలోని ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించడమే లక్ష్యంగా ఈ భారీ భవన నమూనాను సిద్ధం చేస్తున్నారు.