News May 24, 2024
భైంసా: మంటలు అంటుకొని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుంబి గ్రామానికి చెందిన నార్వాడే చేంద్రబాయి (70) సోమవారం ఇంటి ముందు చెత్తను ఊడ్చి మంట పెట్టింది. ప్రమాదవశాత్తు మంటలు చీరకు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News February 7, 2025
ఉట్నూర్: 9 నుంచి జాతర క్రీడాపోటీలు

ఉట్నూర్ మండలంలోని శ్యామ్ పూరులో బుడుందేవ్ జాతర అంగరంగవైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు రెండు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు మేనేజిమెంట్ సభ్యుడు పెందూర్ రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేస్తామన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరుకావాలని వారు కోరారు.
News February 7, 2025
ADB:చైన్ దొంగలించబోయి దొరికిపోయాడు!

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి మాధస్తు మహేందర్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి వాళ్ల బంధువులను చూడడానికి గురువారం సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏమాయికుంటకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి విజయలక్ష్మి మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు దొంగ దొంగ అని అరవడంతో పారిపోగా..సెక్యూరిటీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు రిమాండ్‌కు టూ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.
News February 7, 2025
ఆదిలాబాద్: బొలెరో వాహనం ఢీ.. ముగ్గురికి గాయాలు

ఆదిలాబాద్‌లో గురువారం రాత్రి బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలోని అంకోలి రోడ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ఒక కారును ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిని ఢీకొంది. దీంతో భీంపూర్ మండలంకు చెందిన గణేష్, ఆదిలాబాద్‌కు చెందిన వెంకట్, నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.