News March 3, 2025
భైంసా: మాల్ ప్రాక్టీస్ కింద ముగ్గురు విద్యార్థులు బుక్

భైంసా: గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలో ఇవాళ 3 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద పట్టుబడ్డట్లు చీఫ్ సూపరింటెండెంట్ కర్రోల్ల బుచ్చయ్య తెలిపారు. కాగా పరీక్షలు నిన్న ప్రారంభమవగా తొలిరోజు 8 మంది విద్యార్థులు, ఇవాళ ముగ్గురు మొత్తంగా 11 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అయ్యారన్నారు.
Similar News
News November 24, 2025
ఇతిహాసాలు క్విజ్ – 76

ఈరోజు ప్రశ్న: రావణుడు సీతమ్మవారిని అపహరించినా, ఆమెను బలవంతంగా ముట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 24, 2025
సోకిలేరులో వాగులో యువకుడు గల్లంతు

చింతూరు మండలం తులసి పాక గ్రామ సమీప ఉన్న సోకిలేరు వాగులో స్నానం చేస్తూ పర్యాటకుడు ఆదివారం మృతి చెందాడు.15 మంది మిత్రులతో మోతుగూడెం విహారయాత్రకు వచ్చిన సురేష్ (28) సోకులేరు వాగులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. మృతుడు విజయవాడకు చెందినట్లు ఎస్సై సాధిక్ తెలిపారు. కేసు నమోదు చేశారు.
News November 24, 2025
నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

TG: సొంత నియోజకవర్గం కొడంగల్‌లో CM రేవంత్ ఇవాళ పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనునున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 సర్కార్ స్కూళ్లలో హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తోంది. అది సక్సెస్ కావడంతో ఇదే తరహాలో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


