News March 3, 2025

భైంసా: మాల్ ప్రాక్టీస్ కింద ముగ్గురు విద్యార్థులు బుక్

image

భైంసా: గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలో ఇవాళ 3 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద పట్టుబడ్డట్లు చీఫ్ సూపరింటెండెంట్ కర్రోల్ల బుచ్చయ్య తెలిపారు. కాగా పరీక్షలు నిన్న ప్రారంభమవగా తొలిరోజు 8 మంది విద్యార్థులు, ఇవాళ ముగ్గురు మొత్తంగా 11 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అయ్యారన్నారు.

Similar News

News March 27, 2025

విశాఖలో ముఠా.. నకిలీ వెండి అమ్ముతూ అరెస్ట్

image

విశాఖలో బిహార్‌కు చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. నగరంలోని ఓ జువెలరీ షాపులో 3 కేజీల వెండిని అమ్మేందుకు వెళ్లారు. అనుమానంతో షాపు సిబ్బంది పరీక్షించగా అది నకిలీదిగా తేలడంతో ద్వారకా పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదే షాపులోని 2023లో నిందితులు ఏడు గ్రాముల గోల్డ్ కొట్టేసినట్లు గుర్తించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఐడీలతో మోసాలకు పాల్పడి అనంతరం సొంతూళ్లకు వెళ్లిపోతారు.

News March 27, 2025

విశాఖలో కేజీ మామిడికాయల రేటు ఎంతంటే?

image

విశాఖలోని 13 రైతుబజార్లలో గురువారం నాటి కూరగాయ ధరలను అధికారులు విడుదల చేశారు.(రూ/కేజీలలో) టమటా రూ.15, ఉల్లిపాయలు రూ.23, బంగాళా దుంపలు రూ.16, వంగ రూ.26/32, బెండ రూ.30, బీర రూ.42, మిర్చి రూ.26, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.24, బరబాట రూ.22, పొటాల్స్ రూ.54, కీర రూ.22, గ్రీన్ పీస్ రూ.54, మామిడికాయలు రూ.42, బద్ధ చిక్కుడు రూ.56, చీమదుంప రూ.30, కాకర రూ.32, బీట్ రూట్ రూ.24, క్యాప్సికమ్ రూ.38గా నిర్ణయించారు.

News March 27, 2025

VKB: జిల్లా వాసికి అత్యున్నతమైన సోషల్ సర్వీస్ అవార్డ్

image

సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అత్యున్నతమైన డాక్టరేట్ ఆఫ్ సోషల్ సర్వీస్ పురస్కారం అందుకోవడం సంతోషాన్ని కలిగించిందని జిల్లా వాసి జాటోత్ రవి నాయక్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని హానరరీ డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురి ప్రశంసలు వెలువెత్తాయి.

error: Content is protected !!