News March 12, 2025
భైంసా: విద్యుత్ షాక్తో రైతు మృతి

భైంసా మండలం కోతుల్గాం గ్రామానికి చెందిన రైతు పాలబోయిన భోజన్న(62) మంగళవారం కరెంట్ షాక్తో మరణించినట్లు భైంసా గ్రామీణ సీఐ నైలు తెలిపారు. మొక్కజొన్న పంటకు నీరందించేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు పంటకు జంతువుల బారి నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
Similar News
News November 16, 2025
జమ్మిచేడు రిజర్వాయర్లో గుర్తుతెలియని మృతదేహం

జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడు శివారులోని రిజర్వాయర్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చని, నాలుగు రోజుల కిందట చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. పసుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఎస్ఐ శ్రీకాంత్ (87126 70296)కు ఫోన్ చేయగలరని తెలిపారు.
News November 16, 2025
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం: సీఐటీయూ

సిద్దిపేట కేంద్రంలోని కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన సీఐటీయూ 4వ జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.
News November 16, 2025
ఆదోని జిల్లా సాధించి తీరుతా: ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పార్థసారథి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ఆదోని జిల్లాను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హామీపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


