News January 25, 2025
భైరవపట్నంలో అగ్ని ప్రమాదం

మండవల్లి మండలంలోని భైరవపట్నం , ప్రత్తిపాడు స్టేజీ వద్ద నివాసముంటున్న పిట్టలోళ్ల గుడిసెలు ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి దగ్ధమయ్యాయి. 30 గుడిసెలలోని 25 కుటుంబాల వాళ్లు నిరాశ్రయులయ్యారు. దోమల నివారణకు వెలిగించిన నిప్పు ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. స్థానికులు గాయపడ్డ పది మందిని కైకలూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News February 13, 2025
తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.
News February 13, 2025
ముగ్గురు పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. ఐసీసీ చర్యలు

ముక్కోణపు వన్డే(PAK-NZ-SA) సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ICC కొరడా ఝుళిపించింది. SA బ్యాటర్ మాథ్యూను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న షాహీన్ అఫ్రీదికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. అలాగే కెప్టెన్ బవుమాను రనౌట్ చేసిన తర్వాత సౌద్ షకీల్, కమ్రాన్ గెటౌట్ అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఐసీసీ వారిద్దరి ఫీజులో 10 శాతం కట్ చేసింది.
News February 13, 2025
నిజామాబాద్: ప్రయోగ పరీక్ష కేంద్రాలు తనిఖీ

పరీక్ష కేంద్రాలలో కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లను DIEO రవికుమార్ ఆదేశించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడో దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా పలు ప్రయోగ పరీక్షా కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.