News March 20, 2025
భైoసా: ఆల్ ఇండియా పోటీలకు తపాలా ఉద్యోగులు

ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగులు వినోద్ కుమార్, నరేశ్‌కుమార్. HYDలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో వీరు RSB HYD జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ కూడా ప్రతిభ చాటాలంటే ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మరి.
Similar News
News December 18, 2025
తగ్గేదేలే: సర్పంచ్‌గా కూతురు, ఉప సర్పంచ్‌గా తండ్రి!

బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక పదవులు దక్కించుకొని రికార్డు సృష్టించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కట్ట సంధ్యారెడ్డి సర్పంచ్‌గా ఘనవిజయం సాధించగా, ఆమె తండ్రి కట్ట ముత్యం రెడ్డి వార్డు సభ్యుడిగా గెలుపొంది, అనంతరం ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే గ్రామంలో తండ్రీకూతుళ్లు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులను దక్కించుకోవడం విశేషం.
News December 18, 2025
డాక్టర్ బాలుకు ‘ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు

తలసేమియా చిన్నారుల ప్రాణదాతగా నిలుస్తున్న కామారెడ్డికి చెందిన డాక్టర్ బాలుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్తగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ‘ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. తలసేమియా బాధితుల కోసం సుమారు 5,000 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ గౌరవం దక్కింది. దేశంలోనే ఈ విభాగంలో ఈ రికార్డు సాధించడం ఇదే తొలిసారి అని బాలు తెలిపారు.
News December 18, 2025
మెదక్: ఎన్నికల్లో రూ. 1,01,32,000 స్వాధీనం

మెదక్ జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ. 1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. రూ. 47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ. 26,46,968 విలువైన 3688 లీటర్ల మద్యం, రూ. 27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


