News February 27, 2025
భోగాపురంలో చీటీల పేరుతో మోసం.. భార్యాభర్తల అరెస్ట్

భోగాపురంలో చీటీల పేరుతో మోసం చేసిన కేసులో భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. భోగాపురంలో ఉంటున్న భార్యాభర్తలు తులసీ, మురళీ చీటీలు నిర్వహించేవారు. చీటీ పూర్తయిన వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నారు. దీంతో రూ.30 కోట్ల వరకు నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దార్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈనెల 25న రాజమహేంద్రవరంలో వీరిని అదుపులోకి తీసుకొని బుధవారం విజయనగరం కోర్టులో హాజరుపరిచారు.
Similar News
News February 27, 2025
విజయనగరం: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

విజయనగరంలో ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
News February 26, 2025
విజయనగరం జిల్లాలో రేపు అన్ని పాఠశాలలకు సెలవు

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలో గల అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO యు.మాణిక్యం నాయుడు బుధవారం తెలిపారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో గల అన్ని ఉన్నత పాఠశాలలు సెలవు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 29 పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు ఆయన చెప్పారు.
News February 26, 2025
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా, 1,953 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.