News March 18, 2025
భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.
Similar News
News October 26, 2025
VZM: 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశాలతో 27, 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు RIO తవిటినాయుడు, ICDS పీడీ శాంతకుమారి తెలిపారు. అన్ని కళాశాలలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని సూచించారు. కాగా.. 3 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు <<18111583>>పాఠశాలలకు<<>> సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 26, 2025
VZM: మూడు రోజులు పాఠశాలలకు సెలవు

మొంథా తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27, 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు DEO మాణిక్యం నాయుడు తెలిపారు. అన్ని పాఠశాలలు పూర్తిగా మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు విద్యార్థులకు సమాచారం ఇవ్వాలన్నారు.
News October 26, 2025
మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్

మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఫోన్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. తుఫాను ప్రభావం కారణంగా ఏ పరిస్థితి వచ్చినా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.


