News April 14, 2025
భోగాపురం : ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలై ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భోగాపురంలోని ముంజేరులో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. స్రవంతి ఇంటర్ పరీక్షల్లో ఫైయిలై మనస్తాపం చెంది ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్సై వి పాపారావు తెలిపారు. మృతదేహాన్ని సుందరపేట సీహెస్సీకి తరలించామన్నారు. బాలిక తండ్రి సూరిబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
Similar News
News April 19, 2025
చియా సీడ్స్‌తో గుండె ఆరోగ్యం పదిలం!

చియా సీడ్స్ వల్ల శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి మెదడు, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని తెలుపుతున్నారు. 100గ్రా. చేపల్లో 200-300 మి.గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుందని, అదే 100గ్రా. చియా సీడ్స్ ద్వారా 18గ్రా. లభిస్తుందని వివరిస్తున్నారు. గుండె ఆరోగ్యం కోసం, రక్తంలో మంచి కొవ్వులు పెరగడానికి రోజూ 2స్పూన్లు నానబెట్టుకొని తీసుకోవాలని సూచిస్తున్నారు.
News April 19, 2025
ADB: మళ్లీ జిల్లాకు వచ్చిన మన కలెక్టర్లు

గతంలో ADB జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు IASలు మళ్లీ జిల్లాకు వచ్చి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రామకృష్ణారావు, బుద్ధప్రకాశ్ జ్యోతి ఇద్దరు పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రామకృష్ణారావు, రెవెన్యూ(రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్) సెక్రటరీగా ప్రకాశ్ పనిచేస్తున్నారు.
News April 19, 2025
మల్దకల్: గత 20 రోజుల్లో 6గురు మరణం

మల్దకల్ మండలంలోని నేతవానిపల్లిలో గత 20 రోజుల్లో 6గురు మరణించారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఎక్కడ చూసిన చావు కేకలు వినిపిస్తున్నాయన్నారు. ఆరుగురి వరస మరణాలతో గ్రామం ఉలిక్కిపడింది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా మరణం సంభవిస్తుందని ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించాలని ప్రజలు కోరారు.