News September 1, 2024

‘భోగాపురం ఎయిర్‌పోర్టుకు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ వేగ‌వంతం’

image

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి మౌలిక వ‌స‌తులను క‌ల్పించే ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. విమానాశ్ర‌యానికి వ‌స‌తుల క‌ల్ప‌న‌, భూ సేకరణ తదితర అంశాలపై తన ఛాంబర్‌లో శనివారం సమీక్షించారు. ఎయిర్‌పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు రూ.20కోట్ల‌తో చేప‌ట్టిన ప‌నుల‌పై ఆరా తీశారు. ఈ ప‌నుల‌ను వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌న్నారు.

Similar News

News December 4, 2025

VZM: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

image

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ సీఐ లక్ష్మణ రావు తెలిపారు.

News December 4, 2025

VZM: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

image

ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ మార్గంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులతో గురువారం వీసీ నిర్వహించారు. రాజీ పడదగిన కేసులను ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోక్ అదాలత్‌పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

News December 4, 2025

VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

image

విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.