News October 16, 2024

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రగతిపై విశాఖ ఎంపీ సమీక్ష

image

భోగాపురం విమానాశ్రయం ప్రగతిపై విశాఖ ఎంపీ శ్రీభరత్ జీఎంఆర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ ప్రస్తుత పనులు, డిజైన్, భవిష్యత్తు ప్రణాళిక వంటి అంశాలపై ఎంపీ చర్చించి పలు సూచనలు చేశారు. రాబోయే 50 ఏళ్ల వరకు ఎటువంటి అవాంతరాలు రాకుండా తీరప్రాంత వాతావరణ పరిస్థితులకు తగ్గ మెటీరియల్ వాడాలన్నారు. విమానాశ్రయం పనులు 45 శాతం పూర్తయినట్లు అధికారులు ఈ సందర్భంగా ఎంపీకి తెలిపారు.

Similar News

News January 10, 2026

బాలల రక్షణే లక్ష్యం: విశాఖ సీపీ

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి, వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. బాలలపై నేరాలను అరికట్టేందుకు ప్రోయాక్టివ్ పోలీసింగ్, ఫోరెన్సిక్ ఆధారాలతో వేగవంతమైన దర్యాప్తు, కోర్టు ప్రక్రియల్లో జాప్యం నివారణపై చర్చించారు. పోలీస్, న్యాయవ్యవస్థ, పౌర సమాజం కలిసి పనిచేసినప్పుడే బాలలకు భద్రత లభిస్తుందని, నేరస్థులకు కఠిన శిక్షలు పడతాయని సీపీ స్పష్టం చేశారు.

News January 10, 2026

విశాఖ: ‘డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.1.60 కోట్లు దోచేశాడు’

image

సైబర్ నేరగాళ్ల వలలో ఉద్యోగస్తులు సైతం చిక్కుకుంటున్నారు. రుషికొండ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరిట భయపెట్టి రూ.1.60 కోట్ల వరకు దోచేశారు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి కరీంనగర్ (D) రామగుండంకు చెందిన రాపల్లి అభినవ్‌ను పట్టుకున్నారు. నిందితుడు సైబర్ క్రైమ్ ముఠాకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.

News January 10, 2026

విశాఖ: 12 నుంచి జిల్లా స్థాయి పోటీలు

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీలు పాండురంగపురం వద్ద సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆవిష్కరించారు. గాలిపటాలు ఎగురు వేయుట, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, తాడు లాగుట, కర్ర సాము పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.