News January 13, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి నేడు మీరూ భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

Similar News

News February 19, 2025

గుంటూరులో కర్నూలు జిల్లా వ్యక్తి మృతి

image

బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కర్నూలు జిల్లా వ్యక్తి గుంటూరులో మృతిచెందాడు. అందిన వివరాల మేరకు.. కౌతాళం మండలం సులకేరి గ్రామానికి చెందిన నాగేశ్ (28) జనవరిలో ఉపాధి కోసం వలస వెళ్లారు. ఇవాళ ఉదయం పనులకు పోతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. 

News February 19, 2025

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమైన అంశాలు!

image

● శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
● అన్ని ఆర్జిత సేవలు రద్దు.. ప్రముఖులకు 4విడతలుగా బ్రేక్‌ దర్శనం
● 22న టీటీడీ తరఫున స్వామి, అమ్మవార్లకు వస్త్రాల అందజేత
● 23న సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
● కాలినడక భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● శివరాత్రి రోజున ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం
● భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం
● ఘాట్‌లో 24గంటల అనుమతి
● 453 స్పెషల్ బస్సులు ఏర్పాటు

News February 19, 2025

యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్య

image

కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్యకు గురయ్యారు. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన గుంతకల్ మండలం కసాపురం సమీపంలోని హంద్రీనీవా కాలవలో శవమై తేలారు. పోలీసుల వివరాల మేరకు.. భూ వివాదమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ వివాదం నడుస్తోందని, మృతుడి భార్య కూడా అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!