News January 12, 2025

భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

Similar News

News December 17, 2025

‘జిల్లాలో రబీకి యూరియా కొరత లేదు’

image

కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌కు యూరియా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి. వరలక్ష్మి తెలిపారు. జిల్లాకు మొత్తం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 8,487 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉండగా, డిసెంబర్ చివరికి మరింత యూరియా రానుందని చెప్పారు. రైతులు ఎంఆర్పీ ధరలకే ఎరువులు కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలని సూచించారు.

News December 17, 2025

ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

image

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్‌లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.

News December 17, 2025

ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయండి: జేసీ

image

ఎస్సీ, ఎస్టీ చట్టాలను సమర్థవంతంగా అధికారులు అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.