News January 12, 2025
భోగి మంట వేస్తున్నారా?

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
Similar News
News February 12, 2025
‘ఉద్యాన పంటల సాగు పెంపునకు కృషి చేయాలి’

అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటలను సాగు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 12, 2025
అనంత: ‘బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయిన బాలుడు.. వివరాలు తెలిస్తే చెప్పండి’

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కొండ మీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో ఓ బాలుడు తప్పిపోయాడు. కనీసం తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే బుక్కరాయసముద్రం సీఐకి సమాచారం అందించాలని తెలిపారు.
News February 12, 2025
అనంత: టెన్త్ అర్హతతో 66 ఉద్యోగాలు

అనంతపురం జిల్లా (డివిజన్)లో 66 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.