News January 13, 2025
భోగి స్పెషల్.. భద్రకాళి అమ్మవారి దర్శనం

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేపట్టారు. నేడు భోగి పర్వదినం, సోమవారం సందర్భంగా అర్చకులు అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా, సంక్రాంతి సెలవులు రావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.
Similar News
News February 15, 2025
WGL: నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

2008 డీఎస్సీలో అర్హత సాధించిన ఎస్‌జీటీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వారిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు HNK డీఈవో కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు.ఉమ్మడి జిల్లాలో 295 మంది అభ్యర్థులకు గాను 182 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. నేడు WGL జిల్లాకు చెందిన 8 మందికి నియామకపత్రాలు అందజేయనున్నారు. వీరికి నెలకు రూ.31,040 జీతం ఇవ్వనున్నారు.
News February 15, 2025
వరంగల్: ఎన్నికలకు రెడీ.. వాయిదాపై అధికారుల నిట్టూర్పు!

మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాపై ఏర్పాటు చేశారు.
News February 15, 2025
దుగ్గొండి: ‘ఈజీఎస్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు’

జాతీయ గ్రామీణ ఉపాధి పనుల్లో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో కౌసల్యాదేవి తెలిపారు. దుగ్గొండిలో ఉపాధి హామీ 2023-24 వార్షిక సంవత్సరంలో చేపట్టిన పనులపై మండల స్థాయి సామాజిక ప్రజా వేదికను శుక్రవారం నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టిన పనులపై ఈజీఎస్, పంచాయతీ అధికారులు సభలో చదివి వినిపించారు. ఎంపీడీవో అరుంధతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.