News April 8, 2025
మంగపేట: దెబ్బతిన్న వరి పంటలను పరిశీలిస్తున్న అడిషనల్ కలెక్టర్

మంగపేట మండలం నరసింహసాగర్, మోట్లగూడెం, మల్లూరు గ్రామాల్లో ఉన్న కురిసిన భారీ వర్షాల కారణంగా 80% వరి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను మంగళవారం ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, అధికారులు పరిశీలించారు. అనంతరం దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News October 28, 2025
HYD: మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు ప్రకాశ్ లోంగుబాటు

మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ నుంచి కీలక వ్యక్తి బండి ప్రకాశ్ లొంగిపోయారు. ఆ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా గతంలో ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియాలో ఈయన కీలక ఆర్గనైజర్గా తెలుస్తోంది. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ @ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.
News October 28, 2025
రంపచోడవరం: ఘాట్ రోడ్డులో భారీ వాహనాలు నిలిపివేత

తుఫాన్ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. డి.ఎస్.పి సాయి ప్రశాంత్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద మంగళవారం మళ్లిస్తున్నామని సీఐ సన్యాసినాయుడు తెలియజేశారు. తుఫాన్ తగ్గుముఖం పట్టే వరకు భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలన్నారు.
News October 28, 2025
అరకు: నేడు, రేపు పర్యాటక ప్రదేశాలు మూసివేత

మొంథా తుఫాను ప్రభావంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఐటిడిఏ పరిధిలోని పర్యాటక ప్రదేశాలను నేడు, రేపు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకులోయ మండలంలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్, గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శనిలు మూతపడ్డాయి. కావున ఇప్పటికే అరకు వచ్చిన పర్యాటకులు దీనిని గమనించాలని, అరకు వద్దామనుకున్న పర్యాటకులు తుఫాను తగ్గేవరకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.


