News December 15, 2024
మంగమారిపేట: తీరానికి కొట్టుకు వస్తున్న తాబేళ్ల కళేబరాలు

భీమిలి పరిధిలో మంగమారిపేట తీరానికి గత మూడు రోజులుగా తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. శనివారం రాత్రి 10 తాబేళ్ల మృత కళేబరాలు కొట్టుకురాగా, 11వ తేదీన నాలుగు, 12న రెండు కొట్టుకువచ్చాయి. అవి గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు వస్తున్న సమయంలో శ్వాస అందక ఎక్కువ శాతం మృతి చెందుతున్నాయని జువాలజీ నిపుణులు తెలిపారు.
Similar News
News December 22, 2025
మా ఉద్యోగాలు అడ్డుకోవద్దు జగన్: విశాఖలో నిరుద్యోగుల ఆందోళన

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యువజన, నిరుద్యోగ సంఘాలు ఇవాళ ధర్నా చేపట్టాయి. టీసీఎస్, గూగుల్ వంటి ఐటీ సంస్థలపై వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని నేతలు మండిపడ్డారు. ‘మా జాబ్స్ అడ్డుకోవద్దు జగన్’ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించబోమని తలసముద్రం సూర్యం, గిరిధర్ తదితర నేతలు హెచ్చరించారు.
News December 22, 2025
విశాఖ: హెల్మెట్ లేదా? ‘అయితే పెట్రోల్ లేదు’

విశాఖలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘నో హెల్మెట్ – నో ఫ్యూయల్’ (No Helmet – No Fuel) విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ ఏడీసీపీ కే.ప్రవీణ్ కుమార్ చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోస్తారని స్పష్టం చేశారు. వాహనదారుల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
News December 22, 2025
విశాఖ ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


