News July 12, 2024
మంగళగిరిలోని కొలనుకొండకు వెళ్లనున్న చంద్రబాబు

మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
దక్షిణ భారతదేశంలోనే నాలుగు ధ్వజ స్తంభాలు కలిగిన దివ్య క్షేత్రం

తెనాలి షరాఫ్ బజారులోని శ్రీసువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే 4 ధ్వజ స్తంభాలు కలిగిన ఏకైక ఆలయంగా విరజిల్లుతోంది. 5 ముఖాలతో స్వామి పూజలందుకుంటున్నారు. 1803లో భాగవతుల అన్నయ్య కుటుంబీకులు ఆలయ నిర్మాణం చేయగా నాటి నుంచి ఈక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతోంది. గర్భాలయంలో స్వామివారి 9 అవతార రూపాలు దర్శనమిస్తాయి. నేటి నుంచి వారం పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
News February 7, 2025
గుంటూరు: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 18, 20, 22, 24, 27, మార్చి 1వ తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగ సిబ్బంది తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.
News February 7, 2025
ప్రియురాలికి ఎలుకల మందు ఇచ్చిన ఉద్యోగిపై కేసు: సీఐ

ప్రియురాలికి ఓ సచివాలయ ఉద్యోగి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన ప్రత్తిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. సచివాలయ ఉద్యోగి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇంట్లోకి పెళ్లికి ఒప్పుకోవడం లేదని నమ్మబలికి ప్రియురాలికి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు.