News May 10, 2024

మంగళగిరిలో ఐటీ సోదాలు?

image

మంగళగిరిలోని ప్రధాన రోడ్డు‌పై ఉన్న ఓ వస్త్ర వ్యాపారి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ నివాసం నుంచి ఎవరినీ బయటకు రానివ్వకుండా అధికారులు విచారిస్తున్నారు. సుమారు రూ.10 కోట్ల వరకు నగదు, రూ. 25 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, ఎఫ్‌డీ‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 7, 2025

గుంటూరు: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 18, 20, 22, 24, 27, మార్చి 1వ తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగ సిబ్బంది తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు. 

News February 7, 2025

ప్రియురాలికి ఎలుకల మందు ఇచ్చిన ఉద్యోగిపై కేసు: సీఐ

image

ప్రియురాలికి ఓ సచివాలయ ఉద్యోగి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన ప్రత్తిపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. సచివాలయ ఉద్యోగి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధించి ఉద్యోగం వచ్చాక పెళ్లికి నిరాకరించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఇంట్లోకి పెళ్లికి ఒప్పుకోవడం లేదని నమ్మబలికి ప్రియురాలికి ఎలుకల ముందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. 

News February 7, 2025

గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి

image

కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదైంది. విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒక వ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

error: Content is protected !!