News April 5, 2025

మంగళగిరి: అఘోరీ ఉచ్చు నుంచి బయటపడిన శ్రీవర్షిణి

image

అఘోరీ చేతుల్లో నుంచి మంగళగిరి యువతి శ్రీవర్షిణిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. నెల రోజుల క్రితం శ్రీవర్షిణి తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన లేడీ అఘోరీ, మాయమాటలతో ఆమెను వశం చేసుకుని గుజరాత్‌కు తీసుకెళ్లింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు గుజరాత్‌ వరకు వెళ్లింది. అక్కడ అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Similar News

News November 24, 2025

రేపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు: భట్టి

image

రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సీఎస్ కే.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. చీరల పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పీఎంఏవై అంశాలపై చర్చించారు.

News November 24, 2025

బెల్లంపల్లి: ‘రైతు బిడ్డలు.. మీకెందుకు ఇవన్నీ’

image

ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురిచేస్తోందని.. తల్లిదండ్రులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు రాసిన లేఖ జిల్లాలో సంచలనం రేపింది. బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్ సమస్యలు విన్నవిస్తే ‘మీరు రైతు బిడ్డలు మీకెందుకు ఇవన్నీ’ అని అంటుందని అందులో పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్

News November 24, 2025

కొత్తగూడెం: ‘పోలీస్ వాహనాలు కండిషన్‌లో ఉంచాలి’

image

పోలీస్ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండీషన్‌లో ఉంచుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు వాహనాలను సోమవారం ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లాలోని పోలీస్ డ్రైవర్స్ సమస్యలు, డ్యూటీలో భాగంగా వారి పనితీరును గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని వాహనాలను కండిషన్‌లో ఉంచాలని సూచించారు.