News July 31, 2024

మంగళగిరి ఎయిమ్స్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలి: కలెక్టర్

image

మంగళగిరి ఎయిమ్స్‌లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఎయిమ్స్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై ఆమె బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మోడల్ హాస్పిటల్‌గా తీర్చిదిద్దేందుకు పనులన్నీ వెంటనే పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

Similar News

News October 13, 2024

గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

image

డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన SC,ST అభ్యర్థుల నుంచి ఏపీ సాంఘిక సంక్షేమశాఖ అమరావతి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత బోధన, భోజన, వసతి సౌకర్యాలతో పాటు 3 నెలల ఉచిత శిక్షణ పొందుటకు అవకాశం కల్పించారు. http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని, అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2.50లక్షల లోపు ఉండాలన్నారు.

News October 13, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలలో బైక్ అంబులెన్స్ సేవలు ప్రారంభం: ఎస్పీ

image

దీర్ఘాయుష్మాన్ బైక్ అంబులెన్స్‌ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. క్షతగాత్రులు బైక్ అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే డాక్టర్ లేదా నర్స్ ప్రమాద స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి పంపిస్తారన్నారు. బైక్ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ఉమ్మడి జిల్లాలలో 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. బైక్ అంబులెన్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ 8340000108, 8186000108నంబర్లు ఇవే.

News October 13, 2024

గత ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది: ధూళిపాళ్ల

image

గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబటి మురళీకృష్ణ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ల నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అక్రమాలను నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.