News January 25, 2025
మంగళగిరి: ఏపీఎస్పీ కానిస్టేబుల్ అదృశ్యం

మంగళగిరి పరిధిలోని ఏపీఎస్పీ 6వబెటాలియన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం లిఖితపూర్వకంగా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.
Similar News
News February 25, 2026
శతశాతం ఉత్తీర్ణతకు కృషి: కలెక్టర్

అక్షర ఆంధ్రా అభ్యర్థులు శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నామని గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అక్షర ఆంధ్రా కార్యక్రమంపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 90,426 మంది నమోదు అయ్యారని, 9,043 మంది వాలంటీర్లు బోధిస్తున్నారని కలెక్టర్ వివరించారు. పలు కేంద్రాలను స్వయంగా సందర్శించామని చెప్పారు.
News February 25, 2026
GNT: ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

మార్చి 1 ఆదివారం కావడంతో పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే నగదు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28 శనివారం జిల్లాలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తం 2,51,879 మంది లబ్ధిదారులకు రూ.1,095.5 కోట్లను అందించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెలవుదినాల కారణంగా ముందుగానే పింఛన్లు ఇవ్వడం ఇది ఏడోసారి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
News February 24, 2026
రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వేగవంతం చేయాలని తెలిపారు. రానున్న 3 రోజుల్లో ప్రోగ్రెస్‌ను మరింతగా పెంచేలా ఈఆర్వోలు పర్యవేక్షించాలన్నారు. డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ నిర్దేశిత మార్గదర్శకాలు పాటిస్తూ 100 శాతం పూర్తి చేయాలన్నారు.


