News August 20, 2024
మంగళగిరి జనసేన కార్యాలయంలో మినీ మ్యూజియం

మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రైవేట్ క్యాంప్ కార్యాలయంలో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా మినియేచర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో ఘనతను తెలియజేశారు. బొమ్మలు, శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఈ మేరకు మంగళవారం పవన్ మ్యూజియంలో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
Similar News
News November 15, 2025
GNT: నేడు ఘట్టమనేని శివరామకృష్ణ వర్ధంతి

గుంటూరు (D) బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న, ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు.1965 తేనె మనసులు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. తేనె మనసులు హిట్ అవడంతో, అప్పటి అగ్ర హీరోలతో పోటీపడి సూపర్ స్టార్‌గా ఎదిగారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, ఇలా ఎన్నో హిట్ సినిమాలతో 350పై చిలుకు సినిమాలు చేసి అగ్ర హీరోల సరసన నిలిచారు. 15 నవంబర్ 2022న తుది శ్వాస విడిచారు.
News November 15, 2025
గుంటూరు మిర్చీ యార్డులో 40,026 టిక్కీలు అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 34,160 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 40,026 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 7,698 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.
News November 14, 2025
జిల్లా ప్రజలకు సురక్షిత నీటిని అందించాలి : కలెక్టర్

గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్దేశిత సమయంలో శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారుల ఆదేశించారు. జాతీయ రహదారి పై వరద నీటి డ్రైయిన్ల నిర్మాణం, నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంక్ ల క్లీనింగ్ పై అధికారులు, కమిటీ సభ్యులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


