News August 20, 2024
మంగళగిరి జనసేన కార్యాలయంలో మినీ మ్యూజియం
మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రైవేట్ క్యాంప్ కార్యాలయంలో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా మినియేచర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో ఘనతను తెలియజేశారు. బొమ్మలు, శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఈ మేరకు మంగళవారం పవన్ మ్యూజియంలో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
Similar News
News September 13, 2024
యాత్రికుల రక్షణకు చర్యలు ప్రారంభించాం: మంత్రి లోకేశ్
కేదార్ నాథ్‍లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం, మంత్రి మాట్లాడుతూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, ఈ లోగా యాత్రికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామన్నారు. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.
News September 13, 2024
గుంటూరు: విద్యార్థులకు శుభవార్త చెప్పిన RBI
RBI 90వ వార్షికంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90పేరిట క్విజ్ పోటీలు నిర్వహించనుంది. గుంటూరు జిల్లాలోని అన్ని కాలేజీలలో18వేల మంది ఉన్నారు. పాల్గొనే వారు 2024 sep 1కి 25 ఏళ్లలోపు ఉండి, WWW.rbi90quiz.inలో ఈ నెల 17 లోపు అప్లై చేసుకోవాలి. పోటీలు ఈనెల 19-21తేదీ వరకు ఉ.9- రాత్రి 9వరకు జరగనున్నాయి. జాతీయ స్థాయి విజేతలకు వరుసగా రూ.10లక్షలు,రూ. 8లక్షలు, రూ.6 లక్షలు నగదు ఇవ్వనున్నారు.
News September 13, 2024
గుంటూరు: రాష్ట్ర అధికార ప్రతినిధిగా మస్తాన్ వలీ
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ నియమితులయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మన రాష్ట్రానికి చెందిన 9 మంది కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర అధికార ప్రతినిధిలుగా నియమించింది. ఇందులో మస్తాన్ వలీకి కూడా స్థానం దక్కింది. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వలీకి శుభాకాంక్షలు తెలిపారు.