News March 29, 2025
మంగళగిరి: తిరువూరు టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు భేటీ

తిరువూరు టీడీపీ కార్యకర్తలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొలికపూడి పై ఆరోపణలు చేస్తున్న రమేష్ రెడ్డి వ్యవహరం తమ దృష్టికి రాలేదని తెలిపారు. అతనిపై ఎవరూ మాకు ఫిర్యాదు చేయలేదన్నారు. పార్టీ కుటుంబం లాంటిదని కుటుంబంలో చిన్నచిన్న కలహాలు సహజమన్నారు. ఈ వ్యవహారానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెడతామన్నారు.
Similar News
News December 5, 2025
కేఎల్యూలో నేడు ‘ఉద్భవ్-2025’ ముగింపు సంబరాలు

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయ ఏకలవ్య సాంస్కృతిక ఉత్సవాలు ‘ఉద్భవ్-2025’ నేటితో ముగియనున్నాయి. గిరిజన సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి అతిథులుగా హాజరవుతారు. గిరిజన విద్యార్థుల కళా ప్రదర్శనల అనంతరం, చేతులకు బహుమతులు అందించనున్నారు.
News December 5, 2025
GNT: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆదేశాలు

సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల నియంత్రణ ఇతర ప్రాధాన్య ఆరోగ్య అంశాలపై గురువారం సచివాలయం నుంచి విజయానంద్ అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ వీసీలో పాల్గొన్నారు.
News December 4, 2025
APCRDA “గ్రీవెన్స్ డే” నిర్వహణలో స్వల్ప మార్పు

అమరావతిలో తుళ్లూరు CRDA కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతున్న గ్రీవెన్స్ డే.. ఇకపై ప్రతి శనివారం రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడుతుందని CRDA అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రతి శనివారం – రాయపూడిలోని CRDA ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రీవెన్స్ డే నిర్వహించబడుతుందన్నారు. రాజధాని ప్రాంత రైతులు ఈ మార్పును గమనించాలని కోరారు.


