News August 20, 2024
మంగళగిరి: దొంగిలించిన ఫోన్ నుంచి రూ.లక్ష చోరీ
ఫోన్ దొంగిలించి, రూ.లక్ష కాజేసిన ఘటన మంగళగిరిలో జరిగింది. శ్రీనగర్ కాలనీకి చెందిన రమేశ్ సోమవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తి అతని ఫోను దొంగలించారు. నగదు కోసం బ్యాంకుకు వెళ్లి అకౌంట్ చూడగా ఫోన్ పే ద్వారా రూ. లక్ష పలువురికి బదిలీ అయినట్లు గుర్తించి, మంగళగిరి పోలీసులను ఆశ్రయించాడు. ముగ్గురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 14, 2024
గుంటూరులో ఇంటర్ విద్యార్థిని మృతి
గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో శనివారం దారుణం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
గుంటూరు: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 25 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల విభాగం తెలిపింది.
News September 14, 2024
17న నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ: DMHO
జాతీయ నులి పురుగుల నివారణ దినం సందర్భంగా ఈ నెల 17న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైద్యశాఖ అధికారి విజయలక్ష్మి వెల్లడించారు. మధ్యాహ్నం బోజనం అనంతరం 1-2 సంవత్సరాల వయసు వారికి ఆల్బెండ జోల్ అరమాత్ర, 2-19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.