News April 30, 2024

మంగళగిరి: నవతరం పార్టీ అభ్యర్థికి ‘గాజు గ్లాసు’ పోలిన గుర్తు

image

నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు ఎన్నికల కమిషన్ గ్లాస్ టంబ్లర్ పోలిన గుర్తు కేటాయించింది. మంగళగిరి, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో సుబ్రహ్మణ్యం పోటీకి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో గాజు గ్లాసును పోలిన గుర్తు కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన అభ్యర్థనకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. సోమవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి రాజకుమారి గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News October 19, 2025

యాప్‌ల సంఖ్య తగ్గించాం: DEO రేణుక

image

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విలువైన బోధన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వం అమల్లో ఉన్న యాప్‌లను తగ్గించి కనిష్ఠ సంఖ్యకు తీసుకొచ్చినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ఉపాధ్యాయుల అభ్యంతరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథక వివరాలు అందించడానికి ప్రధానోపాధ్యాయుల విధులలో భాగమని అన్నారు.

News October 19, 2025

GNT: ‘గేట్’ కమిటీ సభ్యులు మన కొత్త కోటేశ్వరరావు

image

కొత్త కోటేశ్వరరావు (1929, అక్టోబర్ 19-2021 నవంబర్ 29) తెనాలి సమీపంలోని సంగం జాగర్లమూడిలో జన్మించారు. 1966లో యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి డాక్టరల్ డిగ్రీని కూడా పొందారు. వరంగల్ ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యునిగా ఆయన పనిచేశారు.

News October 19, 2025

గుంటూరు: ‘కాలుష్యం లేని దీపావళి..ఆనందమైన దీపావళి’

image

కాలుష్యం లేని దీపావళి ఆనందమైన దీపావళిని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి దీపావళిపై రూపొందించిన పోస్టర్‌ను శనివారం కలెక్టర్ విడుదల చేశారు. దీపాలను వెలిగించడం మన సంస్కృతిలో భాగమని కాలుష్యానికి కారణమయ్యే టపాసుల జోలికి వెళ్లవద్దని పిలుపునిచ్చారు. ఈ నెల 20న దీపావళి పండగ సందర్భంగా ప్రజలు హరిత టపాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.