News October 8, 2024

మంగళగిరి: పవన్‌తో భేటీ అయిన సాయాజీ షిండే

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ సినీ నటుడు సాయాజీ షిండే మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటూ ఒక మొక్కను కూడా ఇవ్వాలని రెండు రోజుల క్రితం షిండే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఆలోచనలను పంచుకోవడానికి పవన్‌ని మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో కలిసినట్లు చెప్పారు.

Similar News

News October 20, 2025

స్వాతంత్ర్యోద్యమంలో ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేసిన మహనీయుడు

image

కోన ప్రభాకరరావు 1916, జులై 10న బాపట్లలో జన్మించారు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసి మద్రాసులో పట్టభద్రుడయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశారు.1967, 1972, 1978 శాసనసభకు ఎన్నికయ్యారు.1980-81 వరకు శాసనసభ సభాపతిగా పనిచేశారు.1983 సెప్టెంబరు 2న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యారు.
అక్టోబరు 20 1990న హైదరాబాదులో మరణించారు.

News October 20, 2025

వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం: అంబటి

image

వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంతో పేదలకు ఎంతగానో నష్టం చేకూరుతుందని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆదివారం పెదకాకానిలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటీకరణ చేయడం వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ప్రజలందరూ పీపీపీ విధానాన్ని ఖండించాలని చెప్పారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్మించాలన్నారు.

News October 19, 2025

యాప్‌ల సంఖ్య తగ్గించాం: DEO రేణుక

image

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విలువైన బోధన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వం అమల్లో ఉన్న యాప్‌లను తగ్గించి కనిష్ఠ సంఖ్యకు తీసుకొచ్చినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ఉపాధ్యాయుల అభ్యంతరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథక వివరాలు అందించడానికి ప్రధానోపాధ్యాయుల విధులలో భాగమని అన్నారు.