News October 8, 2024

మంగళగిరి: పవన్‌తో భేటీ అయిన సాయాజీ షిండే

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ సినీ నటుడు సాయాజీ షిండే మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటూ ఒక మొక్కను కూడా ఇవ్వాలని రెండు రోజుల క్రితం షిండే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఆలోచనలను పంచుకోవడానికి పవన్‌ని మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో కలిసినట్లు చెప్పారు.

Similar News

News November 6, 2024

విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలి: గుంటూరు ఎస్పీ 

image

క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో శాంతిభద్రత సమస్యలను పరిష్కరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ని ఎస్పీ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరను స్వయంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదిదారుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని, పెండింగ్ వాహనాలను త్వరగా డిస్పోస్ చేయాలని ఆదేశించారు.

News November 5, 2024

తుళ్లూరు: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో 400/220 కేవీ సబ్ స్టేషన్ నవంబర్ 7న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించి మాట్లాడారు. సీఆర్డీఏ పరిధిలో భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా కేవీ సబ్ స్టేషన్‌ను జీఐఎస్ పద్ధతిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాన్స్కో ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు.

News November 5, 2024

గుంటూరు: ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌కి దరఖాస్తులు ఆహ్వానం

image

APSRTCలో అప్రెంటిస్ షిప్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.రవికాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apsrtc.ap.gov.in లో చూడాలని చెప్పారు.