News November 22, 2024

మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు

image

మంత్రి నారా లోకేశ్‌ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై మంగళగిరి పట్టణ పోలీసు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గత నెల 21వ తేదీన ఐ.వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్‌ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కరీముల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 14, 2024

అల్లు అర్జున్ విడుదల.. అంబటి ట్వీట్

image

సినీ హీరో అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదల కావడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ‘గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు.. ఇది జనం మాట’! అంటూ అంబటి ఏపీ CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేశారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అంబటి వరుస ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

News December 14, 2024

బాపట్లలో దారుణం.. తల్లిదండ్రులను హత్యచేసిన తనయుడు

image

తల్లిదండ్రులను కన్నకొడుకు హత్య చేసిన సంఘటన బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయభాస్కరరావు, సాయి కుమారి అనే దంపతులు అప్పికట్లలో గృహం నిర్మించుకొని నివాసం ఉంటున్నారని ఆస్తుల పంపకంలో విభేదాల గురించి సంబంధించి వీరి కుమారుడు కిరణ్ వారిని దారుణంగా హత్య చేశాడన్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది. పోలీసులు హత్య జరిగిన ఇంటి వద్ద పహారా కాశారు.

News December 13, 2024

పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు

image

సినీ హీరో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పద్మవ్యూహం నుంచి బయటకి వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు! అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.