News August 29, 2024

మంగళగిరి యువతికి గోల్డ్ మెడల్

image

మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ మరోసారి మెరిశారు. మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి జరుగుతున్న జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 57 కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారు. స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 97.5 కేజీలు, డెడ్ లిఫ్ట్ 175 కేజీలు మొత్తంగా 462.5 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ కొట్టారు.

Similar News

News July 10, 2025

16వ తేదీ లోపు వివరణ ఇవ్వాలి: కలెక్టర్

image

భారతీయ బహుజన ప్రజా రాజ్యం పార్టీకి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఈసీ
నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఎందుకు పోటీ చేయలేదనే అంశాలపై 6 రోజుల్లో లిఖిత పూర్వకంగా ప్రధాన ఎన్నికల అధికారికి వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో ఆదేశాలు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News July 10, 2025

గుంటూరులో గంజాయి అమ్ముతున్న యువకుల అరెస్ట్

image

గుంటూరు శివ నాగరాజు కాలనీలో గంజాయి విక్రయిస్తున్న గోపి, కార్తికేయలను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ లతా తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 253 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ఎస్ఐలు షరీఫ్, తిరుమలేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

News July 10, 2025

మంగళగిరి: జనసేనలో చేరిన ఆర్య వైశ్య ప్రముఖులు

image

జనసేన పార్టీలోకి ఆర్యవైశ్య ప్రముఖులు చేరారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయం అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లు, శ్రీకాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షుడు భవనాసి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు.