News March 8, 2025
మంగళగిరి: వివాహం తర్వాత కూడా ఉన్నత చదువులు

వివాహం తర్వాత కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నత చదువులు చదివి ఆదర్శంగా ఉండే వారు కొందరే ఉంటారు. అందులో మంగళగిరికి చెందిన తాయి లక్ష్మీ పద్మజ ఒకరు. వివాహ సమయానికి ఇంటర్ పూర్తి చేసిన ఆమె.. వివాహం తర్వాత హిందీ పండిత్, B.A, M.B.A, PGD HRM, L.L.B, PGD క్రిమినల్ జస్టిస్, PGD సైబర్ లా చదివారు. గత 12ఏళ్లుగా హైకోర్టులో లాయర్గా విధులు నిర్వహిస్తూ పలు ప్రభుత్వ శాఖలకి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా పని చేశారు.
Similar News
News April 17, 2026
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. “వాటర్ – పాజిటివ్ ఆంధ్రా” థీమ్ తో అన్ని గ్రామ పంచాయతీలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 17, 2026
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 7,34,672 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 3,54,330 మంది ఉండగా, మహిళలు 3,80,306 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 36 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 17, 2026
సోలార్ దరఖాస్తుల్లో గుంటూరు జోరు!

పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెళ్ల కోసం గుంటూరులో ఏకంగా 1.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలకు ఈ యూనిట్లు ఉచితం. ఇతరులకు కేంద్రం రూ. 60 వేల రాయితీ ఇస్తోంది. దరఖాస్తుల్లో 30 శాతం వరకు బీసీలవే ఉన్నాయి. అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 20 వేల సబ్సిడీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రాయితీ మార్గదర్శకాల కోసం గుంటూరు లబ్ధిదారులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.


