News June 23, 2024
మంగళగిరి: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల మృతి

సముద్ర స్నానానికి వెళ్లి మంగళగిరి యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12మంది యువకులు ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఈ బీచ్లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.
Similar News
News December 13, 2025
GNT: జాతీయ లోక్ అదాలత్లో 23,466 కేసుల పరిష్కారం

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఒకేరోజు 23,466 కేసులు పరిష్కారం అయ్యాయి. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో 17 బెంచీలతో కలిపి, జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో 1,376 సివిల్, 21,415 క్రిమినల్, 578 చెక్ బౌన్స్, 97 ప్రీలిటికేషన్ కేసులలో రూ.57,68,57,572 ఇప్పించారు.
News December 13, 2025
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు: పెమ్మసాని

మహిళల్లో మౌనం బలహీనతగా మారిపోకూడదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, డీఆర్డీఏ సౌజన్యంతో తుళ్లూరులో శనివారం నిర్వహించిన ‘లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం’ నయీ చేతన 4.0లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
News December 13, 2025
మంగళగిరి: సీఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 16న కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సభా ఏర్పాట్లను హోంమంత్రి అనిత.. డీఐజీ ఏసుబాబు, ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేశ్ బాబులతో కలిసి పరిశీలించారు. అభ్యర్థులు వారి కుటుంబాలతో కలిసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.


