News December 17, 2024

మంగళగిరి DY.CM ఆఫీసు ముందు రైతు నిరీక్షణ.. స్పందించిన పవన్

image

మంగళగిరిలో అనంత జిల్లాకు చెందిన రైతు DY.CMను కలిసేంత వరకు కదలనని భీష్మించుకున్న విషయం తెలిసిందే. నవీన్ హిందూపురం నుంచి ఎడ్లబండిపై నెలరోజులు ప్రయాణించి సోమవారం మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వేడుకోలుకు స్పందించిన పవన్ కళ్యాణ్ రైతుతో మాట్లాడారు. దళారుల బెడద తప్పించాలని, పండించిన ఉత్పత్తులను అమ్ముకోలేక పోతున్నామని రైతు వాపోయాడు. దీంతో సమస్యను విన్న పవన్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించాలని సూచించారు.

Similar News

News January 23, 2025

మాచవరం: సరస్వతి భూముల వివాదం ఇదే

image

పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కి భూములు కేటాయించారు. వారికి కేటాయించిన భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. గత నవంబరులో ఈ వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఇందులో భాగంగా వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.

News January 23, 2025

తెనాలి: వైకుంఠపురం హుండీలో రూ.2000 నోట్లు

image

వైకుంఠపురం దేవస్థానంలో స్వామి వారి హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టగా రూ. 2000 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. రూ.4 లక్షలు విలువ చేసే మొత్తం 200 నోట్లను గుర్తించారు. 2023 మేలో రూ.2000 నోట్లను ఆర్బిఐ బ్యాన్ చేయగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఈ నోట్లు వాడుకలో లేవు. అయితే దేవుడి హుండీలో ఈ నోట్లు మళ్లీ ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.

News January 23, 2025

వినుకొండ: బీర్‌లో పురుగుల మందు కలిపి ఆత్మహత్యాయత్నం

image

వినుకొండ మండలం తిమ్మాయిపాలెంకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాయపాలెంకు చెందిన గోపి అనే యువకుడి భార్య మృతి చెందింది. దీంతో మనస్తాపానికి గురైన గోపి బీర్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.