News September 16, 2024

మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం

image

మంచిర్యాల కలెక్టరేట్‌లో మంగళవారం ప్రజా పాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు.

Similar News

News October 10, 2024

కొమురం భీం వర్ధంతికి CM రేవంత్‌కు ఆహ్వానం

image

ఈ నెల 17న కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించే గిరిజన పోరాట వీరుడు కొమురం భీం 84వ వర్ధంతికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు కొమురం భీం మనుమడు కొమురం సోనేరావు, వర్ధంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ పెందోర్ రాజేశ్వర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌తో కలిసి ఆహ్వాన పత్రికను అందించినట్లు పేర్కొన్నారు.

News October 10, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి CRIME REPORT

image

★ లోకేశ్వరం: మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య
★ ఆదిలాబాద్: రైలు కింద పడ్డ వ్యక్తి మృతి
★ ఆసిఫాబాద్: పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు
★ ఆదిలాబాద్: పట్టగొలుసు మింగిన 7 నెలల పాపా
★ నర్సాపూర్: రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
★ మంచిర్యాల: వ్యక్తి ఆత్మహత్య
★ చెన్నూర్: చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్
★ ఇచ్చోడ: రోడ్డుప్రమాదంలో ఒకరికి గాయాలు
★ లోకేశ్వరం: అనారోగ్యంతో ఒకరు మృతి

News October 9, 2024

రెబ్బెన: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన అక్కా చెల్లెళ్లు

image

రెబ్బెనకు చెందిన ఒకే కుటుంబంలోని అక్కా చెల్లెలు డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ కొలువులు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అక్క ప్రవళిక స్కూల్ అసిస్టెంట్‌గా, చెల్లెలు రష్మిక SGTకి ఎంపికయ్యారు. వీరి తండ్రి మల్లేష్ బార్బర్‌గా, తల్లి పద్మ కేజీబీవీలో సీఆర్టీగా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు ఆడపిల్లలను ప్రయోజకులను చేయాలని కోరికతో కష్టపడి చదివించామని, వారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు.