News March 21, 2025

మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలి: కలెక్టర్

image

జిల్లాలో వారంలోగా మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో ఆయా గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయి అధికారులు తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Similar News

News October 15, 2025

వనపర్తి: క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

image

వనపర్తి జిల్లా అండర్ 14, 17 బాల, బాలికలకు నిర్వహించే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్ అథ్లెటిక్స్ క్రీడలను బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థుల ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 15 మండలాల నుంచి క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలవాలని సూచించారు.

News October 15, 2025

వనపర్తి: రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు: మంత్రి

image

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటుకు జిల్లాల వారీగా కలెక్టర్లు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.

News October 15, 2025

నారాయణపేట: లేబర్ కార్డులు అందివ్వాలి: CITU

image

నారాయణపేటలో భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తులు అందించారు. అర్హులైన కార్మికులు తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పొందాలని సీఐటీయూ నాయకులు బాల్‌రామ్, పుంజనూరు ఆంజనేయులు పిలుపునిచ్చారు. కార్డు ఉన్న వారికి పెళ్లి, కాన్పు, మరణం వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.