News April 14, 2025
మంచిర్యాలకు మళ్లీ వస్తా.. ఇంకా చేస్తా: డిప్యూటీ సీఎం

రూ.1200 కోట్లతో మంచిర్యాలను అభివృద్ధి చేస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరాలు కురిపించారు. రాళ్లవాగు నుంచి గోదావరి ప్రాంతం ముంపునకు గురికాకుండా రూ.260కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.300 కోట్లతో జిల్లాకేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ వస్తాం.. ఇంకా చేస్తాం.. మంచిర్యాల అభివృద్ధి ఆగదు.. అంటూ భరోసా కల్పించారు.
Similar News
News October 31, 2025
ఆదిలాబాద్లో క్రీడాకారుల ఎంపిక పోటీలు

జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో U-17 జోనల్ లెవల్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. నవంబర్ 3న బాలబాలికల రగ్బీ, 4న బాలుర కబడ్డీ, 5న బాలికల క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులు సంబంధిత పోటీల్లో పాల్గొనేందుకు ఆరోజు ఉదయం 10 గంటలలోపు హాజరుకావాలని పోటీల కన్వీనర్లు తెలిపారు.
News October 31, 2025
కరీంనగర్ జిల్లాకు నేడు CM..!

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి హుజూరాబాద్ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో ఏరియల్ సర్వే చేసిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
News October 31, 2025
NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.


