News July 10, 2024
మంచిర్యాలలో పేకాట రాయుళ్ల అరెస్ట్
మంచిర్యాలలోని ఒక రెస్టారెంట్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాలతో మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి రూ.1 లక్ష 78 వేలు నగదు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు సమాచారం.
Similar News
News October 11, 2024
ADB: దమ్మ పరివర్తన దివస్ సందర్భంగా ఆమ్లాకు ప్రత్యేక రైలు
దమ్మ పరివర్తన దినోత్సవం నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో నాందేడ్- ఆమ్లా- నాందేడ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రత్యేక రైలు (నం.07025) నాందేడ్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరుతుందని, అదేవిధంగా శనివారం ప్రత్యేక రైలు (నం. 07026) ఆమ్లా నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైళ్లు ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో సైతం ఆగుతాయని తెలిపారు.
News October 11, 2024
భైంసా: ఆర్టీసీ డ్రైవర్ MISSING
ఆర్టీసీ డ్రైవర్ అదృశ్యమైన ఘటన భైంసాలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎండీ.గౌస్ ఉద్దీన్ వివరాల ప్రకారం.. శివాజీనగర్‌కు చెందిన శామంతుల సుదర్శన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదాయానికి మించి అప్పులు కావడంతో కనిపించకుండా పోయాడు. కాగా ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్న నా మరణానికి ఎవరూ కారణం కారు’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టి వెళ్లి పోయాడు. భార్య అశ్విని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News October 11, 2024
నిర్మల్: రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
దసరా పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 2 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ రజాక్ అలీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్లో ఈనెల 12న దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా శుక్రవారం ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు, ముధోల్, భైంసాలో 13న దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా శనివారం ఉదయం 10 నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు.