News November 14, 2024

మంచిర్యాలలో బాలికపై అత్యాచారయత్నం

image

11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఒడ్డెర కాలనీకి చెందిన రాజేందర్ అదే కాలనీకి చెందిన ఓ బాలికను హైటెక్ సిటి వద్ద చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు వెల్లడించారు.

Similar News

News December 10, 2024

ఆదిలాబాద్: ‘ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి’

image

భీంపూర్ మండలం వడూర్ గ్రామ సమీపంలో ఉన్న పెన్ గంగా నది తీరంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వడూర్ గ్రామస్థులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. పెనుగంగా నుంచి జేసీబీలతో లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు నింపుకొని గ్రామం నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనీ పేర్కొన్నారు. దీని వలన రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

News December 9, 2024

అభయారణ్యంలో వ్యవసాయ విద్యార్థుల పర్యటన

image

జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో జగిత్యాల వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం వారు జన్నారం మండలంలోని గోండుగూడా, తదితర అటవీ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి బటర్ఫ్లై పరిరక్షణ కేంద్రం, అడవులు వన్యప్రాణుల సంరక్షణ, తదితర వివరాలను అటవీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News December 9, 2024

బాసర లాడ్జిలో యువకుడి సూసైడ్

image

బాసరలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI గణేశ్ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం సూరారానికి చెందిన రాజేందర్ (25) నిన్న లాడ్జిలో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు, తమ్ముడిని బాగా చూసుకో, నిన్ను చాలా కష్టపెట్టిన, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ సూసైడ్ నోట్‌ను అతడి తమ్ముడి ఫోన్‌కు పంపినట్లు SI వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.