News April 5, 2024
మంచిర్యాలలో ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెండ్
మంచిర్యాలలోని కార్మల్ కాన్వెంట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. అయితే మొదటి రోజు విధులకు కారణం లేకుండా గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సదురు ఉపాధ్యాయులను వివరణ కోరగా వారు స్పందించకపోవడంతో డీఈవో యాదయ్య వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News December 25, 2024
ADB: ‘వాజ్ పేయ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ నగేశ్’
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగేశ్ మాట్లాడుతూ.. వాజ్ పేయ్ పుట్టినరోజును సుపరిపాలన దినంగా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.
News December 25, 2024
ADB: సమగ్ర శిక్ష ఉద్యోగులకు తుడుందెబ్బ మద్దతు
టీపీసీసీ అధ్యక్ష హోదాలో వరంగల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేశ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆదివాసీ నాయకులతో కలిసి ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.
News December 25, 2024
ఆదిలాబాద్: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?