News March 8, 2025

మంచిర్యాలలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 29 ఉంటుందని, తెలుపు రంగు ఫుల్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జీఆర్పీ ఎస్ఐ మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News October 24, 2025

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాము కలకలం

image

భద్రాద్రి కలెక్టర్ క్యాంపు ఆఫీసులో శుక్రవారం పాము కనిపించడంతో సిబ్బంది స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్‌కు సమాచారం అందించారు. సంతోష్ సురక్షితంగా పామును పట్టుకుని బంధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అతన్ని అభినందించి, రక్షణ పరికరాలకు అవసరమైన సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా కేంద్రంలో స్నేక్ రెస్క్యూ ప్రదర్శన శాల ఏర్పాటు అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.

News October 24, 2025

HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

image

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్‌లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.

News October 24, 2025

కనీసం వెయ్యి మందితో యూనిట్ మార్చ్ నిర్వహించాలి: కలెక్టర్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో భాగంగా ‘యూనిటీ మార్చ్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ పోస్టర్లను కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. యువతలో దేశభక్తి, సమైక్యత భావాలను పెంపొందించేలా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6 వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కనీసం వెయ్యి మంది యువకులతో యూనిటీ మార్చ్ పాదయాత్రను ఘనంగా చేపట్టాలన్నారు.