News March 8, 2025

మంచిర్యాలలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 29 ఉంటుందని, తెలుపు రంగు ఫుల్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జీఆర్పీ ఎస్ఐ మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News March 11, 2026

వరల్డ్ కప్ గెలిచాక ట్రైన్‌లో ముంబైకి వెళ్లిన దూబే

image

ప్రపంచ కప్ గెలిచామన్న సంతోషం ఓ వైపు. ఈ మధుర క్షణాలను పిల్లలతో పంచుకోవాలనే ఆరాటం మరో వైపు. అదే సమయంలో విమాన టికెట్స్ దొరక్కపోవడంతో టీమ్ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే తన భార్యతో కలిసి రైలులో థర్డ్ ఏసీ కోచ్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్, క్యాప్ ధరించి పై బెర్త్‌పై పడుకుని సొంతూరుకు చేరుకున్నారు.

News March 11, 2026

వేట్లపాలెం ఘటనపై సీఎం సీరియస్..!

image

వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో బుధవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా తయారీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకూడదని హెచ్చరిస్తూ, బాణసంచా కేంద్రాలపై కఠిన నిఘా ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు.

News March 11, 2026

పాలమూరు: భానుడి ప్రతాపం.. అడుగంటుతోన్న భూగర్భ జలాలు!

image

ఉమ్మడి పాలమూరులో వేసవి ఆరంభంలోనే ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వేసవి ప్రారంభంలోనే జలవనరులు అడుగంటడం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదని, నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.