News September 11, 2024
మంచిర్యాలలో వ్యభిచారం
మంచిర్యాల పట్టణంలో ఇటీవల వ్యభిచారం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు యువతులు, ఇద్దరు బాలికలు, ఆరుగురు విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాగా నిర్వాహకులు భార్యాభర్తలని పోలీసులు వెల్లడించారు.
Similar News
News October 3, 2024
వరి కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలి: సీఎం
ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ రాజర్షిషా, గౌస్ ఆలం పాల్గొన్నారు. అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే DSC అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 3, 2024
బెల్లంపల్లి: PG సీట్ల వెబ్ ఆప్షన్స్.. ఈనెల 4న చివరి తేదీ
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కాకతీయ యూనివర్సిటీ PG రెగ్యులర్ కోర్సుల కోసం 2వ విడతలో అక్టోబర్ 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి గడువు ఉందని ప్రిన్సిపల్ శంకర్, కోఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. వారు మాట్లాడుతూ..2024-25 విద్య సంవత్సరానికి CPGET ఎంట్రన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు విషయాన్ని గమనించాలని సూచించారు.
News October 3, 2024
నిర్మల్: కల్లులో కలిపే కెమికల్స్ పట్టివేత
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారీగా కల్లులో కలిపే రసాయనాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. స్థానిక శాంతినగర్ కాలనీలోఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.43 లక్షల విలువైన 26 సంచుల క్లోరల్ హైడ్రేడ్, మూడు కిలోల ఆల్ఫోజోలం సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.