News March 14, 2025
మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్లో నివాసం ఉండే వి.శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకున్న శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రీధర్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
వరంగల్: ఖర్చులు చూసుకుంటాం.. వచ్చి ఓటెయ్యండి..!

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఓరుగల్లు అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉదయం 6 నుంచే గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఉపాధి కోసం వివిధ పట్టణాలకు వెళ్లిన వారికి ఫోన్లు చేసి రానుపోను ఛార్జీలతో పాటు ఖర్చులు పెట్టుకుంటామని, వచ్చి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకం కావడంతో ఎవరినీ వదలకుండా ఓటర్లందరినీ కవర్ చేస్తున్నారు.
News December 5, 2025
వామ్మో.. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40వేలు

వందల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో దేశీయ విమాన టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఢిల్లీ టు లండన్ టికెట్ ధర రూ.25వేలు ఉంటే ఢిల్లీ టు కొచ్చి టికెట్ ఫేర్ ఏకంగా రూ.40వేలకు పెంచేశారు. ఇది సాధారణంగా రూ.5,000-రూ.10,000 మధ్య ఉంటుంది. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40,452కు ఎగబాకింది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రేట్లు పెంచవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
News December 5, 2025
ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.


