News March 4, 2025
మంచిర్యాల: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్లు, ఈఈలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆర్థిక సంవత్సరం ముగింపుపై కలెక్టర్ కుమార్ దీపక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖల పరిధిలో కేటాయించిన అభివృద్ధి పనుల నిర్వహణ కోసం మంజూరైన నిధులు ఖర్చుల వివరాలు, గుత్తేదారులకు కేటాయించిన పనుల వివరాలు, ఖర్చులు, జీఎస్టీ ఇతర పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని వారికి సూచించారు.
Similar News
News November 3, 2025
WWC-2025 ‘లీడింగ్’ రికార్డులు

☞ అత్యధిక వికెట్లు-22(దీప్తి శర్మ-భారత్)
☞ సిక్సర్లు- 12(రిచా ఘోష్-భారత్)
☞ పరుగులు- 571(లారా-దక్షిణాఫ్రికా)
☞ వ్యక్తిగత స్కోరు- 169(లారా)
☞ సెంచరీలు-2(లారా, గార్డ్‌నర్, హేలీ)
☞ అర్ధసెంచరీలు-3(లారా, దీప్తి శర్మ)
☞ అత్యధిక ఫోర్లు-73(లారా)
☞ ఈ టోర్నీలో భారత్ తరఫున మంధాన, ప్రతీకా, రోడ్రిగ్స్ సెంచరీలు చేశారు.
News November 3, 2025
ప్రకాశం: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలామంది వాట్సాప్ గ్రూపులను దుష్ప్రచారానికి వాడుతున్నారు. తెలిసీతెలియక గ్రూపుల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని క్రాస్ చెక్ చేయకుండా షేర్ చేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు ఇస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టింగులు చేసినా? తప్పుడు ప్రచారం చేసినా అడ్మిన్లు బాధ్యత వహించాలని చెబుతున్నారు. మీకూ నోటీసులు ఇచ్చారా?
News November 3, 2025
NRPT: నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నేడు నారాయణపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్‌ఈ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను రాతపూర్వకంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.


